Usha Sri Charan: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై.. ఎట్టకేలకు స్త్రీ, శిశు శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ స్పందించారు. చిన్నారి మృతిపై.. తెదేపా నేలు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పర్యటనకు వచ్చిన ఆదరణను చూడలేకే.. తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబసభ్యులు తన వల్ల నష్టం జరగలేదని చెప్పినా.. ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని ఆక్షేపించారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా తమపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదన్నారు. అయినా బాలిక కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేకూరేలా చర్యలు చేపడతామని మంత్రి హామి ఇచ్చారు.
సంబంధిత కథనాలు: