అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటోందని.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలసి బాల సదనాన్ని పరిశీలించారు. అక్కడి పిల్లలతో ఆమె కాసేపు ముచ్చటించి... వాళ్లతో కలసి అల్పహారం తీసుకున్నారు. మిగిలిన జిల్లాల కంటే ఇక్కడ సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. ఐరన్ లోపం లేకుండా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలుగా మారకూడదని.. అందరిలాా జీవనం సాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు.
ఇదీ చూడండి