వైకాపా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురంలోని రాజేంద్ర మున్సిపల్ పాఠశాలలో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. సంవత్సరంన్నర కాలంలో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.60 నుంచి 70 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలోనే లేదన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యను అందించాలనే సంకల్పంతో అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 30 లక్షల 70 వేల మంది ఖాతాలో నగదు జమ చేయడానికి చర్యలు చేపడతామన్నారు.
రాష్ట్రంలో పాలన, అభివృద్ధి చూసిన కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఏది ఏమైనా ప్రజాసంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...