సొంత రాష్ట్రానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద మధ్యప్రదేశ్ కూలీలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులకు గాను మూడు నెలల క్రితం అనంతపురం జిల్లాకు వచ్చారు. ఇంతలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలైన కారణంగా.. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు వీలు లేక పూట గడవని స్థితిలో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.
కొన్ని రోజులుగా తాము ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా... అనుమతులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము కాలినడకనే తమ రాష్ట్రానికి వెళ్తామన్నారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న తహసీల్దార్ వాణిశ్రీ సొంత ఖర్చుతో 33 మందికి పది రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.
కలెక్టరేట్ నుంచి మధ్యప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. వారి నుంచి అనుమతి రావడమే ఆలస్యం.. పంపిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ వారం పది రోజుల్లో పూర్తి అవుతుందని వెల్లడించారు.
ఇవీ చూడండి: