కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములవుతున్నమున్సిపల్ కార్మికులకు.. రోటరీ క్లబ్ ప్రతినిధులు మాస్కులు, శానిటేజర్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రోటరీ క్లబ్ కదిరి శాఖ.. 250 మంది కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు అందచేశారు. కరోనా విస్తరిస్తున్న వేళ కార్మికులకు తమవంతు సాయంగా పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: