అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో వినూత్న రీతిలో సాగే మారెమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలి వచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ కలశాలతో ఊరేగింపు తో ప్రారంభమైన ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది. ఈ మారెమ్మ జాతరలో ఆలయ పూజారి పెద్ద గుట్టగా వేసిన ముల్లకంపలను ఎక్కుతూ వెళ్లి అటువైపు ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఆ పదునైన ముల్లపై పడుకొంటారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘట్టం జాతరకే ప్రధాన ఆకర్షణగా అక్కడి భక్తులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పాఠశాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్.. భయాందోళనలో తల్లిదండ్రులు