అనంతపురం జిల్లా గోరంట్ల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న ఆర్.చంద్రమౌళిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. మందలపల్లికి చెందిన ఓ రైతు నుంచి ఈరోజు మధ్యాహ్నం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. సిబ్బందితో కలిసి అనిశా డీఎస్పీ కులశేఖర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
శ్రీనివాసులు అనే వ్యక్తి రెండేళ్ల క్రితం మరణించగా.. అతని పేరు మీదనున్న 2.26 ఎకరాల భూమిని తనకు బదలాయించాలని కోరుతూ భార్య భువనేశ్వరి పలుమార్లు అర్జీ పెట్టుకున్నట్లు అనిశా సిబ్బంది తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించకపోగా.. రూ.20వేలు లంచం ఇవ్వాలని బాధితురాలిని మందలపల్లి వీఆర్వో చంద్రమౌళి డిమాండ్ చేశాడని వెల్లడించారు. ఆమె కుమారుడు వెంకటశివ అనిశాకు సమాచారం ఇచ్చారని చెప్పారు. గోరంట్లలో వీఆర్వో రూ.10వేలు తీసుకునే సమయంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదును సీజ్ చేశామని.. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వివరించారు.
ఇదీ చదవండి:
సర్పంచి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే సిద్దారెడ్డి