రాజకీయ నాయకుల ఒత్తిళ్లు భరించలేక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులో వెళుతున్న ఘటన.. అనంతపురం జిల్లా తలుపుల మండలంలో జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది.. తమపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయంటూ జిల్లా పరిషత్ సీఈవో, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి తాము సామూహిక సెలవులపై వెళుతున్నామంటూ ఉన్నత అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:
BJP: ప్రాజెక్టులపై సీఎం మాటలు నీటి మూటలే: విష్ణువర్థన్ రెడ్డి