అనంతపురంలో 'మన అనంత - సుందర అనంత' కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ కార్యక్రమం చేపట్టారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా పాలనాధికారి గంధం చంద్రుడు, అధికారులు, వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి చెత్తను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం చేపట్టిన నాలుగు వారాల్లోనే కొంత మార్పు కనిపిస్తోందని కలెక్టర్ అన్నారు. నగరంలోని పలు యూనియన్లు, సంస్థలకు వార్డులను దత్తత ఇచ్చి వాటిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అప్పగిస్తామన్నారు. ఏ కార్యక్రమం అయినా ఒక్కరితో సాధ్యం కాదని.. ప్రజలందరూ భాగస్వామ్యం అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే, ఎంపీలు అన్నారు.
ఇదీచదవండి. మడకశిరలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు