అనంతపురం జిల్లాలోని కమలపాడు తండాకు చెందిన వెంకటేష్ నాయక్ గతంలో సారా విక్రయించేవాడు. ఇలాంటి వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు.. పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పలువురు తండావాసులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు... వజ్రకరూరు పోలీసులు వెంకటేష్ నాయక్‌పై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేశారు. అనంతరం.. వెంకటేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులే ఇందుకు కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. బెయిల్ రాదని.. జీవితాంతం పోలీస్ స్టేషన్ లోనే గడపాలని పోలీసులు చెప్పిన కారణంగానే.. వెంకటేశ్ ఈ ప్రయత్నం చేశాడని చెప్పారు. ప్రస్తుతం వెంకటేశ్ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి: