అనంతపురంలో మద్యానికి బానిసైన నరసింహులు అనే వ్యక్తి హెచ్ఎల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహులు ఆటో నడుపుతూ జీవించేవాడు. నిత్యం మద్యం సేవించి.. ఇంటిలో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. రెండు రోజులుగా కనబడకుండా పోవడంతో బంధువులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్ఎల్సి కాలువ పక్కన ఆటో ఉండటంతో నరసింహులు నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి... బంధువుల ఫిర్యాదు