ప్రేమిస్తున్నానని నమ్మించి యువకుడు మోసగించాడంటూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాంధీనగర్‌కు చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తెస్తే మోహం చాటేస్తున్నాడని బాధిత యువత వాపోయింది. బాధితురాలికి మద్దతుగా హిజ్రాలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. యువతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి
కడప డీఈఈ సుధాకర్ అరెస్టు... రేపు కర్నూలు అనిశా కోర్టుకు నిందితుడు