అనంతపురం జిల్లా నార్పల నుంచి బొందలవాడ వద్ద వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్పల నుంచి ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.
ప్రభుత్వ పాలకులు మారినా.. నార్పల రహదారికి మోక్షం లేదని గ్రామస్తులు వాపోయారు. నిత్యం ఏదో ఒక సమయంలో ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోయారు. చిన్నపాటి వర్షానికే రహదారి మెుత్తం బురదగా తయారవుతుందనీ... పెద్ద పెద్ద గుంతల్లో నీరు నిలిచిపోతుందన్నారు. గుంత ఎంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు.
ఇదీ చదవండి: చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు