అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం విద్యుత్ కార్యాలయానికి ట్రాన్స్ఫార్మర్తో వస్తున్న లారీ... కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో రహదారి విభాగినిని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటం, ఎదురుగా వాహనాలు రాని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది. దారిలో లారీ అడ్డంగా పడిన పరిస్థితుల్లో గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురై అందులో ఉన్న ఆయిల్ మొత్తం రోడ్డుపై పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రించారు.
ఇదీ చదవండి: