ఈ నెల 8న అనంతపురంలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు న్యాయ సేవా సదన్ జిల్లా కార్యదర్శి తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. రాజీయే రాజ మార్గంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని దాదాపు 30 వేల కేసుల్లో రాజీ చేసే అవకాశాలు ఉన్న 14 వందల కేసులు గుర్తించినట్లు తెలిపారు. లోక్ అదాలత్లో వచ్చిన తీర్పే చివరి తీర్పనీ, ఇక్కడ తీర్పు వచ్చిన తరువాత తిరిగి అప్పీలు చేసుకోవటానికి వీలుపడదని స్పష్టం చేశారు. కేసు విచారణ ఇక్కడే పూర్తైతే న్యాయస్థానంలో కట్టిన ఫీజు వెనక్కి ఇస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఉత్తమ ఉపాధ్యాయిని... "లక్ష్మీనరసమ్మ"