అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల కేంద్రంలో మిడతలు దాడి చేశాయి. మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని జిల్లెడు చెట్టు ఆకులను తినేశాయి. అంతేగాక జమ్మానపల్లి గ్రామంలో జిల్లేడు చెట్టు ఆకుతో పాటు మునగ చెట్టు ఆకులను మిడతలు తినడంతో స్థానికులు, రైతులు ఆందోళకు గురవుతున్నారు. మున్ముందు మిడతలతో పంటలకు ఏ ప్రమాదం ముంచుకోస్తుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు.
మడకశిరలో కలవరపెడుతున్న మిడతలు - locusts damage the tree at jammanapally village
ఒకవైపు కరోనా మహమ్మరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటే... మరోవైపు మిడితలు పంటలపై దండయాత్రలు చేస్తున్నాయి. పంటలను పూర్తిగా తినేస్తున్నాయి.

చెట్టును తినేస్తున్న మిడతలు
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల కేంద్రంలో మిడతలు దాడి చేశాయి. మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని జిల్లెడు చెట్టు ఆకులను తినేశాయి. అంతేగాక జమ్మానపల్లి గ్రామంలో జిల్లేడు చెట్టు ఆకుతో పాటు మునగ చెట్టు ఆకులను మిడతలు తినడంతో స్థానికులు, రైతులు ఆందోళకు గురవుతున్నారు. మున్ముందు మిడతలతో పంటలకు ఏ ప్రమాదం ముంచుకోస్తుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:సౌకర్యాల లేమితో ఉపాధి హామీ కూలీలు సతమతం