దేశమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్డౌన్ అమలవుతుంటే గుంతకల్లులో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులకు అనుమతిచ్చినట్లే అన్ని దుకాణాలు తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కోసం ఆన్లైన్లో ఇసుక నమోదుకై సైట్ పునఃప్రారంభించాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు కాకపోతే వాటిని ఆరెంజ్ జోన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'జనావాసాల్లో క్వారంటైన్ వద్దు'