ETV Bharat / state

అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ - అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

అనంతపురం జిల్లాలో రెండో దశ పోలింగ్ జరిగే 19 మండలాల్లోని పలు పంచాయతీల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రతను పటిష్టం చేశారు.

local body
local body
author img

By

Published : Feb 13, 2021, 11:05 AM IST

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో రెండవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6:30కి మొదలైంది. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రారంభంలో ఓటర్లు కాస్త తక్కువగానే ఉన్నా ఏడు గంటలకల్లా భారీగా చేరుకొని క్యూకట్టారు. ఉదయం 8 నుంచి ఓటర్ల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. బెలుగుప్ప మండలం వ్యాప్తంగా 19 పంచాయతీలు ఉండగా ఒకటి ఏకగ్రీవం అయింది. మిగతా 18 గ్రామ పంచాయతీలు, 111 వార్డు మెంబర్లకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాప్తాడు మండలంలో ఎల్​ఆర్​జీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. ధర్మవరం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

ఇదీ చదవండి: ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోండి: ఎస్‌ఈసీకి హైకోర్టు‌ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.