అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. వైకాపా అభ్యర్థుల తరఫున రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ప్రచారం నిర్వహించారు. 17వ వార్డు వైసీపీ అభ్యర్థి రామాంజనేయులు తరఫున ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. 18వ వార్డు వైకాపా అభ్యర్థి నందిని తరఫున రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
మరోవైపు తెదేపా అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. 17వ వార్డు తెదేపా అభ్యర్థి చిన్న నారాయణ తరఫున కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ప్రచారం నిర్వహించారు.
ఇదీచదవండి.