కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిని అనంతపురం జిల్లా విడపకనకల్లు చెక్పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నారాయణస్వామి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.1.63 లక్షల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. లాభాపేక్షకు ఆశపడి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలియజేశారు.
ఇదీ చదవండి :