అనంతపురం జిల్లా గుడిబండ మండలం హిరేతుర్పి, కరికెర గ్రామాల మధ్య రహదారిపై ఉన్న కల్వర్టులపై చిరుత కనిపించింది. సాయంత్రం వేళ అటుగా వెళ్తున్న వాహనదారులు దాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. వాహన చోదకులను చూసిన చిరుత అక్కడి నుంచి పరారైంది. వెంటనే అటుగా వెళ్లే వాహనదారులకు చిరుత కనబడిన విషయం చెప్పి హెచ్చరించారు. అయితే చిరుత సంచారం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: