అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలలో మేకల మందపై చిరుత దాడిచేసింది. ఈ ఘటనలో రెండు మేకలు మృతి చెందాయి. పట్టణానికి చెందిన నాగమ్మ, తిమ్మరాజులు తమకున్న మేకల్ని ఊరి శివార్లలో ఉన్న కొండ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. సాయంకాలం తిరిగి మేకలను ఇంటికితీసుకు వస్తుండగా ..అక్కడే ఉన్న చిరుత వాటిపై దాడిచేసింది.
ఈ ఘటనలో రెండుమేకలు మృతిచెందాయి. చిరుత దాడి చేసిన ప్రాంతం.. పట్టణానికి అతి సమీపంలో ఉండడంతో శివారుకోట కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి. కొండపై గుహలో పిల్లలు.. శ్రమించి రక్షించిన పోలీసులు