ప్రమాదవశాత్తు ఓ చిరుత మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. హిందూపురం మండలం చలివెందుల గ్రామ సమీపంలోని పంట పొలాల్లో మృతి చెందిన చిరుత పులిని గ్రామస్థులు గుర్తించారు. నీరు తాగేందుకు వచ్చి విద్యుత్ షాక్కు గురై మృతి చెంది ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పులి మృతి చెందిన విషయాన్ని స్థానికులు.. పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు అందించారు. చిరుతపులి మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిరుత మృతికి కారణాలు అటవీశాఖ అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: