అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వేరుశెనగ విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచే స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద బారులు తీరారు. రాచేపల్లి, మైలారంపల్లి, వై.రామాపురం, కౌకుంట్ల, అమిద్యాల గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాలు ఎక్కువ క్వింటాళ్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం వెయ్యి క్వింటాళ్ల స్టాక్ మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో రైతులు మధ్య తోపులాట జరిగింది. వారిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన అధికారులు ఎంత సేపటికీ రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. స్టాక్ ఎక్కువ తెప్పించి ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు కోరారు.
ఇదీ చదవండీ... "జులై 15లోపు గ్రామ సచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్"