అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో కర్ణాటకలోని ధర్మస్థలం నుంచి అనంతపురం వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్సరీలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో నర్సరీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి బృందంలోని సభ్యుల్లో ఎక్కువ మంది పలు ప్రాంతాల్లో దిగిపోవడం పెను ప్రమాదం తప్పింది. కాగా ఘటన జరిగిన సమయంలో బస్సులో 10 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇవీ చూడండి...