ETV Bharat / state

అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం - anathapuram news

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం అనంతపురం-న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభమైంది. దీనిని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, సీఎం జగన్​లు వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.

Kisan train between Anantapur and New Delhi has started.
అనంతపురం-న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం
author img

By

Published : Sep 9, 2020, 11:45 AM IST

అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభమైంది. దిల్లీలోని కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్​లు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సురేష్.సి అంగడి, ద.మ.రైల్వే జీఎం, అనంతపురం ఎంపీ, ఇతరరైల్వే అధికారులు పాల్గొన్నారు.

దేశంలోనే రెండో కిసాన్‌ రైలు ఏపీకి కేటాయించినందుకు సీఎం జగన్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కరోనా సమయంలో వ్యవసాయ ఎగుమతులకు ఇబ్బంది లేకుండా ఈ కిసాన్ రైలు కీలకం కానుందని సీఎం తెలిపారు.

ఇదీ చదవండి: నేడు చలో అంతర్వేదికి పిలుపునిచ్చిన భాజపా, జనసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.