అనంతపురం జిల్లా గోరంట్ల సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. కర్నాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. రెండు కార్లను సీజ్ చేశారు. గుమ్మయ్య గారి పల్లి క్రాస్ వద్ద ధర్మవరానికి మద్యం తరలిస్తున్న ఇద్దరిని, ఒక ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. బూదిలి గ్రామం వద్ద మద్యం తరలిస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనాన్ని, 1200 టెట్రా ప్యాకెట్ల మద్యం సీజ్ చేశారు.
మొత్తం మూడు కేసుల్లో 2 కార్లు, 2ద్విచక్ర వాహనాలు,1200 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం సీజ్ చేసి.. 9 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన్నట్లు సీఐ జయనాయక్ వివరించారు.
ఇదీ చదవండి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని జేడీఏపై ఉద్యోగినుల ఫిర్యాదు