ఇదీ చదవండి: ఉరవకొండలో వ్యాపారుల ఆందోళన... ఇందుకే..
వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: కాల్వ శ్రీనివాసులు - latest news in anatapur
వేరుశెనగ ధరను మార్కెట్ శక్తులు శాసిస్తున్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అందుకే ధరలు పతనమవుతున్నాయని అన్నారు.
'వేరుశెనగ ధర పడిపోయినా పట్టించుకోరు'
వేరుశెనగ ధర సగానికి సగం పడిపోయినా వ్యవసాయ శాఖ మంత్రి గానీ, జిల్లా వ్యవసాయ అధికారులు గానీ పట్టించుకోలేదంటూ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో వేరుశెనగ పొలాలను ఆయన శనివారం పరిశీలించారు. నెలన్నర కిందట క్వింటా వేరుశెనగ ధర ఇప్పుడు సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ పంటైనా లాభం తీసుకొస్తుందని అనుకున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా వ్యవసాయశాఖ మంత్రి గానీ, వ్యవసాయ అధికారులు గానీ కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. వేరుశెనగ ధరను మార్కెట్ శక్తులు శాసిస్తుండటంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరుశెనగ సాగుచేసిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఉరవకొండలో వ్యాపారుల ఆందోళన... ఇందుకే..
sample description