ముఖ్యమంత్రి జగన్కు పేర్ల పిచ్చి పట్టుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకు నీటిని తరలించే ఎత్తిపోతల పథకానికి పరిటాల రవీంద్ర పేరు తొలగించి... వైఎస్సార్ అప్పర్ పెన్నార్ పేరు పెడుతూ తీసుకొచ్చిన ఉత్తర్వులను రద్దు చేయకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పరిటాల రవీంద్ర పేరు మార్చారని ధ్వజమెత్తారు.
రాప్తాడుకు నీటి సౌకర్యం కోసం పరిటాల రవి ఎంతో కృషి చేశారని గుర్తు చేసిన కాల్వ... తెదేపా ప్రభుత్వ కృషిని తన గొప్పగా చాటుకునేందుకు జగన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. జగన్ వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించారని నిలదీశారు. తెదేపా హయాంలో పుట్టకనుమకు ఇచ్చిన నిధులను మూడు ప్రాజెక్టులకు మళ్లించి ఒక్కరూపాయీ అదనంగా ఇవ్వకుండా.. లక్ష ఎకరాలకు నీరందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... 'ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు..'