సీఎం జగన్ వ్యక్తిగత ఇబ్బందులు, అసమర్థ నిర్ణయాలు పోలవరానికి శాపంగా మారాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలూ కేంద్రం పరిశీలించడం లేదంటే లోపం ఎక్కడుందని ప్రశ్నించారు. పోలవరం వ్యయాన్ని కేంద్రం భారీగా తగ్గించినప్పటికీ వైకాపా ప్రభుత్వం నోరెత్తి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదట్నుంచి వైకాపా ప్రభుత్వం పోలవరంపై విషం చిమ్ముతోందని కాలవ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాజ్యసభలో దుష్ప్రచారం చేయటంతో.. ఆ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సీఎం జగన్‌ది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థ విధానమని కాలవ అన్నారు.
ఇదీ చదవండి: రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు: ఆనందబాబు