ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులకు తీరని ద్రోహం చేస్తున్నారని తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఈ రెండేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను వివాదాస్పదంగా మార్చిందని కాలవ శ్రీనివాసులు అనంతపురంలో చెప్పారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు రాయలసీమను నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. హైదరాబాద్లో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే తీరుపై తాము కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు. పెట్రోల్, డీజల్ ధరలను నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పాదయాత్రకు పిలుపునిస్తే తనపై, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారని కాలువ శ్రీనివాసులు చెప్పారు.
ఇదీ చదవండి : viveka murder case: ప్రొద్దుటూరు కోర్టుకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి