రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అనంతపురం జిల్లా కదిరి తెదేపా నేతలు ఆరోపించారు. కొవిడ్‌ను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమయ్యిందనీ.. దీనికి నిరసనగా కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఒక వైపు కరోనాతో మరో వైపు ఆర్థిక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మరింత ఉగ్రరూపం దాల్చకముందే... మరిన్ని కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సూచించారు. క్వారంటైన్ సెంటర్లలో వసతి, భోజన సదుపాయలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఒక్క ఇల్లు కనిపించకుండా నీటమునిగిన ఊరు