అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఊంజల సేవను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ప్రహ్లాద సమేత స్వయంభూగా వెలసిన నరసింహస్వామిని మల్లెలు, తులసి, సుగంధాలతో అలకరించారు. రంగమండపములో ఆశీనులైన శ్రీవారికి పుష్ప అర్చన, తులసి అర్చనలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుల స్వామికి ఊంజల సేవను భజంత్రీల మధ్య ఘనంగా చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకను నిర్వహించారు.
ఇదీ చదవండి: భారీగా తగ్గిన పాల అమ్మకాలు: నష్టపోతున్న పాడిరైతు