అనంతపురం జిల్లా కదిరిలో ఈరోజు మధ్యాహ్నం నుంచి పూర్తి లాక్డౌన్ అమలుచేస్తున్నారు. కదిరి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. కదిరి నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పట్టణానికి చెందిన ఇద్దరు శుక్రవారం కరోనా పాజిటివ్ అనుమానిత లక్షణాలతో మృతి చెందారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసే క్రమంలో ఈరోజు నుంచి సోమవారం ఉదయం వరకు కదిరి పట్టణంలో మందుల దుకాణాలు, తాగునీరు, పాలడైరీలకు మినహా అన్నిరకాల దుకాణాలు మూసివేస్తున్నట్లు తహసీల్దార్ మారుతి ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: చివరి గంటలో రిలయన్స్ దూకుడు- సెన్సెక్స్ 458+