కరోన వ్యాప్తి చెందుతున్న కారణంగా నగరాల్లో ఉపాధి పొందుతున్న గ్రామ ప్రజలు తిరిగి వారి స్వగ్రామాలకు వలస బాట పట్టారు. ఈ నేపథ్యంలో మడకశిర మండలం రేకులకుంట అనంతపురం గ్రామంలోని సచివాలయాన్ని జేసీ-2 సిరి సందర్శించారు. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి లేదని ఏ ఒక్కరూ చింతించాల్సిన అవసరం లేదన్న ఆమె ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి... : 'పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలి'