బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న అభియోగంపై పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిల విచారణ పూర్తైంది. వీరిద్దరినీ ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు విచారించారు. మొత్తం 64 ప్రశ్నలతో విచారించి సమాచార నివేదికను తయారుచేశారు. పోలీసు విచారణ తీరును జేసీ ప్రభాకర్‌రెడ్డి తప్పుబట్టారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, విక్రయదారులను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అధికారులను నిలదీశారు. పోలీసుల ప్రశ్నావళి అంతా తానొక్కడే తప్పు చేసినట్లుగా ఉందని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.
'మిగిలిన వారిని ప్రశ్నించాలి'
ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి.. ఎక్కడ తప్పు జరిగిందో తేల్చాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి వాహనం తన ఖాతా చెక్కుల ద్వారానే కొనుగోలు చేశానన్న ఆయన.. తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప కేంద్ర కారాగారానికి తరలింపు
కస్టడీ ముగియడం వల్ల జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని అనంతపురం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఇద్దరినీ కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
ఇదీ చూడండి: