LIVE: కుప్పంలో సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU IN KUPPAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2025, 5:28 PM IST
|Updated : Jan 6, 2025, 5:58 PM IST
CM CHANDRABABU IN KUPPAM: కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ మేరకు ఉదయం కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ వర్శిటీ ఆడిటోరియంలో 'స్వర్ణ కుప్పం విజన్- 2029' డాక్యుమెంట్ ఆవిష్కరించారు. జూన్‌లోగా హంద్రీనీవా జలాలు పాలారు వాగు తెచ్చి దానిపై చెక్‌డ్యామ్ నిర్మిస్తామని వెల్లడించారు. కుప్పంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇవాళ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ప్రజలను పేదిరికం నుంచి బయటపడేసే పీ4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆనాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైఎస్సార్సీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళిక రచించామని పేర్కొన్నారు. ప్రసుతం కుప్పం నియోజకవర్గంలో సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jan 6, 2025, 5:58 PM IST