వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్లు తిడుతుంటే.. సీఎం జగన్ నోరు విప్పలేని స్థితిలో ఉన్నారంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్ని మాటలంటున్నా.. మంత్రులెందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ అంటే తనకు చాలా అభిమానమని చెప్పారు.
తండ్రిని తిడుతున్నా జగన్ స్పందించకపోవటం చూస్తుంటే..హైదరాబాద్లో నివాసాలున్న తమలాంటి వారికి భయం వేస్తోందని అన్నారు. వైఎస్సార్ అని పార్టీ పెట్టుకున్న జగన్..తన తండ్రి ఫొటో కూడా కనిపించకుండా చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి:
కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ... త్రిసభ్య కమిటీ భేటీ వాయిదాకు వినతి