ETV Bharat / state

తాడిపత్రిలో జేసీ సోదరుల గృహనిర్బంధం

తాడిపత్రిలో జేసీ సోదరుల గృహనిర్బంధం
తాడిపత్రిలో జేసీ సోదరుల గృహనిర్బంధం
author img

By

Published : Jan 4, 2021, 9:22 AM IST

Updated : Jan 5, 2021, 7:01 AM IST

09:19 January 04

ఇంట్లోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి‌ దీక్ష

మాజీ ఎమ్మల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారంటూ తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ సోదరులను గృహనిర్బంధం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాడిపత్రిలో గత నెల 24న వైకాపా, తెదేపా నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ.. హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేసీ సోదరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దారు కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 

అప్రమత్తమైన పోలీసుశాఖ అనంతపురం నుంచి తాడిపత్రి వరకు భారీగా పోలీసులను మోహరించింది. తాడిపత్రి వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్టు అమల్లో ఉందని.. ధర్నాలు, నిరసనలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జేసీ సోదరులను గృహ నిర్బంధం చేసినట్లు పేర్కొన్నారు. 

తహసీల్దారు కార్యాలయానికి తాళం

జేసీ ప్రభాకర్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడంతో ఆయన భార్య ఉమారెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మార్వో కార్యాలయానికి సిబ్బంది చేత తాళం వేయించారు. 'నా బాధ్యతను నా భార్య ఉమారెడ్డి పూర్తి చేస్తోంది' అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 

ఇంట్లోనే జేసీ ప్రభాకర్‌ దీక్ష

జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేయడంతో ఆయన నల్లదుస్తులు ధరించి ఇంట్లోనే దీక్షకు దిగారు. శాంతి భద్రతలు లోపించిన కారణంతోనే తాను దీక్షకు దిగినట్లు ప్రభాకర్‌ పేర్కొన్నారు. తాను దీక్ష చేపడితే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని తెలిపే లేఖ ఇవ్వకుండా పోలీసులు తనను నిర్బంధం చేయడం సరికాదని ఆయన అన్నారు.   

జేసీ ప్రభాకర్‌ రెడ్డికి పోలీసుల నోటీసులు

మౌనదీక్ష చేపట్టడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వెలుపలే దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు సెక్షన్‌ 149 కింద నోటీసులు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న చోట నుంచి బయటకు రాకూడదంటూ ఆంక్షలు విధించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఆంక్షలు పెట్టినట్లు నోటీసులో వెల్లడించారు. 

సోదరుడి అరెస్ట్​పై ప్రభాకర్​రెడ్డి ఆగ్రహం

తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పురు మండలం జూటురు గ్రామ సమీపంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తామనడాన్ని ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి... పడక గదిలోకి రావడంతో పాటు ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. గృహ నిర్బంధం చేయడానికి వచ్చిన వారు ఇంటి బైటనే ఉండాలని లోపలికి ప్రవేశించే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

 భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టుకు లైన్ క్లియర్

Last Updated : Jan 5, 2021, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.