ETV Bharat / state

చెత్త వాహనాలనూ వదలడం లేదంటూ.. ఎమ్మెల్యేపై ఫైర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

Municipal Chairman JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసనకు దిగారు. మరమ్మతులకు గురైన పారిశుద్ధ్య వాహనాలతో ర్యాలీతో పాటు భిక్షాటన చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, మీడియాతో కలిసి పాడైపోయిన వాహనాల వద్దకు వెళ్లిన ఆయన ఎమ్మెల్యే పెద్దారెడ్డి సొంత ట్రాక్టర్లు అద్దెకు పెట్టారని ఆరోపించారు..

JC Prabhakar Reddy
ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి
author img

By

Published : Dec 7, 2022, 2:40 PM IST

JC Prabhakar Reddy: దాతలనుంచి విరాళంగా తెచ్చిన వాహనాలను మూలన పడేసి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనాలను అద్దెకు పెట్టారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య వాహనాల మరమత్తులకు నిధులు కావాలంటూ చెడిపోయిన వాహనాలతో భిక్షాటనకు సిద్ధమైన తెదేపా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. గతంలో తాను చైర్మన్గా ఉన్నప్పుడు జేసీబీ లు, ప్రోక్లైన్లు, ట్రాక్టర్లు వంటి వాహనాలను దాతల నుంచి విరాళంగా, సొంతంగా కొనుగోలు చేసి మున్సిపాలిటీకి ఇచ్చానని ఆయన అన్నారు.

ఆ వాహనాలన్నిటిని చిన్నపాటి ఖర్చులతో మరమ్మతు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా మూలన పడేసి అద్దె వాహనాలను వాడుతున్నారని ఆయన విమర్శించారు. తాడిపత్రి పట్టణంలో ర్యాలీ నిర్వహించి వాహనాలను షెడ్డు కు తీసుకెళ్లాలని యత్నించిన ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకున్నారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ జెసి, పోలీసులే వాహనాలను షెడ్డుకు తీసుకెళ్లాలని కోరారు. అనుమతి లేకుండా పట్టణంలో తిరగటానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జేసీ తన ఇంటి ఎదుటనే బైఠాయించారు. ఈ వాహనాల మరమ్మత్తు, పోలీసుల ఆంక్షలు పై జేసీ ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి

తాడిపత్రిలో భిక్షాటనకు సిద్ధమైన మున్సిపల్‌ ఛైర్మన్ జేసీ దివాకర్‌రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.