మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని, అభ్యర్థులను బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేస్తోందని జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మవరంలో 28, 30 వార్డుల జనసేన అభ్యర్థులు పార్వతమ్మ, వెంకటమ్మలను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లారని మధుసూదన్ అన్నారు. బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీచదవండి.