ETV Bharat / state

ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి: కాల్వ శ్రీనివాసులు

గుత్తేదారులు పనులు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు జయరాం రెడ్డి.. రాయదుర్గం- కనేకల్ రహదారి విస్తరణ పనులు చేస్తున్న వారిని బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
author img

By

Published : Sep 5, 2021, 9:15 PM IST

రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి గుత్తేదారులు పనులు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని తెదేపా పొలిట్​బ్యూలో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం కాంట్రాక్టర్లు చేసిన పనులకు నేటికీ బిల్లులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని దుయ్యబట్టారు.

రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు జయరాం రెడ్డి ఆదివారం రాయదుర్గం- కనేకల్ రహదారి విస్తరణ పనులు అడ్డుకోవటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గుత్తేదారులు బతికే పరిస్థితి లేదని కాల్వ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఇసుక, మట్టి ,రాళ్ళు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నారని కాల్వ ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోకి మద్యం తరలించి ఒక్కొక్క గ్రామంలో 20 మంది వైకాపా నాయకులు మద్యం షాపులు పెట్టుకొని విక్రయిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పై సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: Viral Video: 'ఏయ్..పని ఆపెయ్..' గుత్తేదారుకు వైకాపా నేత బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.