ETV Bharat / state

ఇంటర్ మార్కుల జాబితాల అదృశ్యం కేసు.. విచారణ ప్రారంభం - బొమ్మనహల్ లో ఇంటర్ కాలేజి మార్కులిస్ట్ మిస్సింగ్

అనంతపురం జిల్లా బొమ్మనహల్ ప్రభుత్వ ఇంటర్ మార్కుల జాబితాల గల్లంతుపై విచారణ ప్రారంభమైంది. డీవీఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. జూనియర్ అసిస్టెంట్​ జాకీర్ హుస్సేన్... అనంతపురం నుంచి మార్కుల జాబితాలు తీసుకువస్తుండగా అదృశ్యమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారంలో రోజుల్లో మార్కుల జాబితాలు అందిస్తామని ఆర్​ఐవో తెలిపారు.

ఇంటర్ మార్కుల జాబితాలు
ఇంటర్ మార్కుల జాబితాలు
author img

By

Published : Oct 14, 2020, 11:49 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్కుల జాబితాల గల్లంతుపై డీవీఈవో బాలప్ప ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక బృందం విచారణ ప్రారంభించింది. కళాశాలలో విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్లు, విద్యార్థుల వివరాలు, మార్కుల జాబితాలను తీసుకొని వచ్చే సమయంలో.. పార్సిల్ పోయిందనే విషయాలపై కళాశాల జూనియర్ అసిస్టెంట్​ జాకీర్ హుస్సేన్​ను విచారించారు.

ఈ సందర్భంగా డీవీఈవో బాలప్ప మాట్లాడుతూ కళాశాలలో 137 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితా పార్సిల్​ను అనంతపురంలోని ఆర్ఐవో కార్యాలయంలో సంతకం చేయించుకుని జూనియర్ అసిస్టెంట్​కు అప్పగించారు. అయితే ఆయన పార్సెల్ తీసుకొని వెళ్లే సమయంలో బస్టాండ్​లో పోయిందని, తనకు గుర్తుకు రావడం లేదని జాకీర్ హుస్సేన్​ విచారణాధికారి వద్ద పేర్కొన్నాడు. గల్లంతైన విషయంపై తనకు కూడా సమాచారం ఇవ్వని కారణంగా...ఈ నెల 10వ తేదీన బొమ్మనహల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఎస్ఐ నాగమధు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు కూడా పరిశీలించామన్నారు.

జాకీర్ హుస్సేన్ బస్టాండ్ వరకు వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్​లో కనిపించాడని అన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్​పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా వారంలోగా ఒరిజినల్ మార్కుల జాబితాలు అందజేయడానికి ఆర్​ఐవో వెంకటరమణ నాయుడు ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.

ప్రస్తుతం విద్యార్థులకు తాత్కలిక మార్కుల జాబితాలను ప్రిన్సిపాల్ వద్ద అందుబాటులో ఉంచామన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చేరే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. త్వరలోనే మార్కుల జాబితాలను అందజేస్తామన్నారు. విచారణలో బొమ్మనహల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఏపీలో పరిస్థితి ఎలా ఉంది?'... సీఎం జగన్​కు ప్రధాని ఫోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.