PENNA RIVER: ఎండాకాలం కావటంతో పెన్నా నదిలో జలాలు తగ్గి ఇసుక మేటలు తేలాయి. ఆ నదిలో రజకులు చిన్నచిన్న నీటి కుంటలు ఏర్పాటు చేసుకొన్నారు. అక్కడి దోబీఘాట్లలో దుస్తులు ఉతికి.. అక్కడే ఆరేస్తున్నారు. ఎడారిలా మెరిసిపోతున్న ఇసుకపై రంగురంగుల దుస్తుల తోరణాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణాన్ని ఆనుకుని ఉన్న పెన్నా తీరంలో ఈ చిత్రం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. నీరు లేక చిన్నబోయిన నది తీరం దుస్తుల హారాలతో ఆకట్టుకుంటోంది కదూ!
ఇదీ చదవండి: మడ అడవుల విస్తీర్ణంలో తగ్గుదల... జీవ వైవిధ్యానికి ప్రమాద ఘంటికలు..