నీలంపల్లిలో ఇసుక అక్రమ తరలింపు - నీలంపల్లిలో అక్రమంగా ఇసుక తరలింపు
అనంతపురం జిల్లా నీలంపల్లిలో కొందరు వ్యక్తులు రాత్రీ పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పర్మిట్ లేకుండా అడ్డదారుల్లో ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.