ETV Bharat / state

Gravel Scam: అక్రమంగా మట్టి తవ్వకాలు.. అడ్డుకోని అధికారులు!

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పలు ప్రాంతాల్లో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ అక్రమాలు సాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. విషయంపై రెవిన్యూ అధికారులను ప్రశ్నించగా.. గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

Illegal excavations in Uravakonda
ఉరవకొండలో అక్రమ మట్టి తవ్వకాలు
author img

By

Published : Aug 18, 2021, 12:59 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారుల అనుమతి లేకుండా కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు, గుట్టలు, హంద్రీనీవా, హెచ్ఎల్సీ కాలువ గట్టు వంటి ప్రాంతాల్లో.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా గ్రావెల్​ను తవ్వి ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండ గుట్టల్లో లోతైన గోతులు తవ్వి పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు.

డిమాండ్​ తగ్గ ధరతో..

అక్రమాలపై అధికారుల నుంచి అంతగా స్పందన లేదని.. వారు తీసుకుంటున్న అరకొర చర్యలను అక్రమార్కులు లెక్క చేయడం లేదని సమాచారం. ఒక ట్రాక్టర్ మట్టి రవాణాకు దూరాన్ని బట్టి 8 వందల నుంచి 13 వందల దాకా వసూలు చేస్తున్నారు. గ్రావెల్ డిమాండ్ ఉన్న చోట.. ఈ ధరలు మరింత పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా వెలిగొండ గ్రామ పరిసరాలలోని కొండ ప్రాంతంలో కాలువ నింభగల్లు సమీపంలోని హెచ్ఎల్సీ కెనాల్ ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు 20 నుంచి 30 వరకు ట్రాక్టర్ ట్రిప్పులు తరలుతుంటాయి.

రవాణాతో దెబ్బతిన్న రోడ్లు..

గ్రావెల్ తరలింపు కారణంగా ఆయా మార్గాలలోని రహదారులు శిథిలావస్థకు వచ్చాయని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మునివేలును సంప్రదించగా.. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. రెవిన్యూ శాఖ తరపున ఎవరికి గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తహసీల్దార్ చెప్పారు.

ఇదీ చదవండి:

పెన్‌కాక్‌ సిలాట్ క్రీడలో రాణిస్తున్న ఒంగోలు యువత.. ఆసియా యూత్‌ గేమ్సే లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.