అనంతపురం జిల్లా కదిరి మండలం కారెడ్డిపల్లి తండా, పట్నం గ్రామాల సమీపంలోని ప్రభుత్వ భూములను కొందరు చదును చేసేందుకు ప్రయత్నించారు. గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికుల ఆందోళన, అధికారుల హెచ్చరికలతో వెనక్కి తగ్గిన కబ్జాదారులు అక్కడనుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి..కొత్తగా 9,536 కరోనా కేసులు