వ్యర్థాలతో అనర్థాలు ఎదురవుతాయని...,వాటిపై పోరాటం చేసి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి శంకర్ నారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డితో పాటు కలిసి ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు 15 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలంతా సామాజిక బాధ్యతతో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేసి రోగాల బారిన పడరాదన్నారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త కుండీలలో వేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు.
కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ..ఆరుబయట మలవిసర్జనకు స్వస్తి పలికి మరుగుదొడ్లను వాడాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లోని వ్యర్థాలను తప్పనిసరిగా చెత్త కుండీలలోనే వేయాలన్నారు.
ఇదీచదవండి