Hunter Gatherers Problems: అనంతరం జిల్లా గుంతకల్లులో షికారీలు నివసించే ప్రాంతంలో.. చిన్నపాటి వర్షం వస్తే చాలు మురుగు నీరు అంతా ఇళ్లల్లోకి చేరుతుంది. పట్టించుకోవలసిన మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులు అటుగా తొంగి చూసిన పాపాన పోవడంలేదని షికారీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారులోని 32వ వార్డులోని భాగ్యనగర్‌లో ఆలూరు రోడ్డుకు సమీపంలో సుమారు 70 షికారీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. అడవిలో పక్షులను, జంతువులను వేటాడి జీవినం సాగించటం వారి ప్రధాన వృత్తి.
సుమారు 150 ఓట్లు కలిగిన షికారీల జీవన వ్యవస్థను మార్చడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షం వస్తే మురుగు నీరు అంతా రోడ్డుపైకి, గుడిసెల్లోకి చేరి ఇంటిలోని ధాన్యం, దుస్తులు, వంట సామాగ్రి తడిసిపోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారిందని వాపోతున్నారు. ఇక్కడే బావి ఉండటంతో పాములు అధికంగా వస్తున్నాయని, కొందరు పాముకాటుకు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంతకల్లు మున్సిపాలిటీ గ్రేడ్ వన్ స్థాయిని పొందిందేగాని మురుగునీటిని పట్టణ శివారులకు తరలించడంలో విఫలమైందని చెప్పవచ్చు. షికారీల కాలనీలో రోడ్డుపైన ప్రవహిస్తున్న మురుగునీరు, కాలవలో నిలిచిపోయిన వ్యర్థాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వర్షం వచ్చినప్పుడు అధికారులు అక్కడి పరిస్థితులను చూసి.. లోతట్టుగా ఉండడంతో సమస్య పరిష్కారం కాలేదని, వర్షం తగ్గిన తర్వాత అంతా సర్దుకుంటుందని.. షికారీలకు ఉచిత సలహాలు ఇవ్వడం సాధారణమైందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు మా పరిస్థితులను గుర్తించి పరిష్కరించాలని, లేకపోతే ప్రజాప్రతినిధులకు తమ ఓటు ద్వార తగిన బుద్ది చెబుతామని షికారీలు అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రోడ్లు, కాలువలు నిర్మిస్తామంటూ నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ఈసారి ఓట్లు అడగడానికి వస్తే చెప్పుల దండ వేసి తగిన బుద్ధి చెప్తామని మండిపడ్డారు.
Sarpanches Problems in AP: నిధుల కొరతతో సర్పంచుల అవస్థలు.. బ్లీచింగ్‌కూ డబ్బుల్లేని పరిస్థితి
పట్టణ నడిబొడ్డున తాము నివాసముంటున్న స్థలాలు ఖరీదైనవి కావడంతో.. తమను తరిమేయాలని కొందరు ప్రజా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా తమకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేని, తలపై నీడ లేని తమను.. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఓటర్ల మాదిరిగానే చూస్తున్నారు తప్ప మనుషులుగా ఎవరూ తమను గుర్తించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.
దీంతోపాటు కర్నూలు జిల్లాలో షికారీలు ఎస్టీ జాబితాలో ఉంటే.. అనంతపురంలో ఓసీలుగా ఉండటం దారుణమన్నారు. దీనివల్ల షికారీలు 8 ,9 తరగతుల కంటే ఎక్కువ చదువుకోలేకపోతున్నామంటూ, ఇక తమ తలరాతలు మారవని వాపోతున్నారు. దీనివల్ల తమకు సరైన ఉపాధి కూడా దొరకటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ జాబితాలో ఉంటే అయినా ప్రభుత్వం తమను గుర్తిస్తుందని చిన్న ఆశ మిగిలిందన్నారు.
Drinking water Problem in Ananthapur ఇంకా తాగునీటి కష్టాలా..! పాలకులు.. కాస్త దృష్టి పెట్టండి..!