అనంతపురం నగరంలోని మారుతీ నగర్లో అక్రమంగా కట్టారంటూ పేదల ఇళ్లను అధికారులు(houses demolished by officials in anantapur) తొలగించారు. తమ ఇళ్లను పడగొడితే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న బాధితులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అధికార పార్టీకి చెందిన ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటి ముందర ఉన్న నాలుగు ఇళ్లను మాత్రమే అధికారులు తొలగించారు. రోడ్డు స్థలంలో ఇళ్లను అక్రమంగా కట్టారని అధికారులు చెబుతున్నారు. కానీ.. రోడ్డుకు అడ్డుగా ఈ నాలుగు ఇల్లే ఉన్నాయా..? మిగతా ఇల్లు లేవా..? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు..? అధికార పార్టీకి చెందిన ఈశ్వరయ్య ఇంటికి ముందర ఉన్నందునే తమ ఇళ్లను తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులు ఇచ్చి వారం గడవకముందే జేసీబీతో ఇళ్లను తొలగించారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 15 ఏళ్ల నుంచి అక్కడే నివాసం ఉంటున్నామని.. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న తమ నివాసాలు ఇప్పుడు అడ్డంగా మారాయా అని బాధితులు ప్రశ్నించారు. ఇళ్లను తొలగిస్తున్న సమయంలో బాధితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించారని వారు మండిపడ్డారు.
ఇదీ చదవండి:
HEAVY RAIN: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు..